telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యముడే నన్ను ఇంటికి దిగబెట్టారు… దర్శకుడు అనురాగ్ కౌంటర్

anurag

ఎప్పటికప్పుడు రివ్యూలు ఇస్తూ, రియాల్టీ షోలలో పాల్గొంటున్న కంటెస్టెంట్లపై, నటీనటులపై ప్రముఖ సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్రముఖ దర్శకుడు అనురాగ్, కమాల్ మధ్య ఎప్పట్నుంచో వివాదాలు నడుస్తున్నాయి. సినిమా రివ్యూలు చెప్పొద్దని అనురాగ్ తనను బెదిరించారని గతంలో కమాల్ ఆరోపించాడు. కమాల్ ఆరోపణలను అనురాగ్ అప్పట్లోనే ఖండించారు. తాజాగా కమాల్ ఆర్ ఖాన్‌కు చెందిన వెబ్‌సైట్ దర్శకుడు అనురాగ్ మరణించారని పేర్కొంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ ఇక లేరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాసింది. ఈ వార్తపై అనురాగ్ వ్యంగ్యంగా స్పందించారు. “అవును.. నిన్న యమధర్మరాజును చూశా. ఆయనే స్వయంగా నన్ను ఇంటికి దిగబెట్టారు. ఇకపై, మరిన్ని సినిమాలు చేయాలని నాతో చెప్పారు” అంటూ అనురాగ్ ట్వీట్ చేశారు.

Related posts