telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

నష్టం వచ్చిన సరే..తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరించాం : ఏపీఎస్సార్టీసీ ఎండీ

tsrtc buses

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయంలో ఒకట్రోండు రోజుల్లో క్లారిటీ రావచ్చని , ఏపీఎస్సార్టీసీ ఎండీ కృష్ణబాబు పేర్కొన్నారు. తెలంగాణ కోరిన విధంగానే 1.05 లక్షల కిలో మీటర్లు తగ్గించుకున్నామని..వాళ్లు ప్రతిపాదించిన రూట్లల్లో కూడా ఏపీ బస్సులను తక్కువగా తిప్పేందుకు అంగీకరించామని తెలిపారు. తెలంగాణ పెట్టిన షరతుల వల్ల విజయవాడ-హైదరాబాద్ రూట్లో సుమారు 350 బస్సులు తిరిగే అవకాశం ఉండదన్నారు. ఏపీఎస్సార్టీసీకి నష్టం చేకూర్చేలా ఉన్నా.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరించామని వెల్లడించారు. ఏడాదికి సుమారు రూ. 265 కోట్ల మేర రెవెన్యూ లాస్ వస్తుందని..తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరించాం కాబట్టి తెలంగాణ నుంచి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నామని ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా నిఘా పెట్టామని తెలిపారు కృష్ణబాబు. కాగా లాక్ డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల రద్దైన విషయం తెలిసిందే. 

Related posts