telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్

krishna water board

కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో వాడివేడిగా జరిగింది. జలసౌధలో బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులపై ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

కృష్ణా నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయి, వాటినే కొనసాగిస్తున్నామని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని రజత్‌కుమార్ సూచించారు. విభజన అనంతరం నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని రజత్‌కుమార్ స్పష్టం చేశారు.

Related posts