కమల్ హాసన్ ఎన్నికల్లో పోటీచేయడంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మధురైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేయనున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అయితే.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని మాత్రం తర్వాత ప్రకటించనున్నట్లు వెల్లడించారు. సినీ హీరో కమల్ హాసన్.. మక్కల్ నీధి మయం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.. ఆదివారం రోజుల ముధురైలో కమల్ హాసన్ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో కమల్ పార్టీ అభిమానులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేయడాన్ని కమల్ తప్పుపట్టారు. సగం దేశం ఆకలి బాధతో ఉంటే…. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అవసరమా అని కమల్ విమర్శలు చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా.. కొత్త సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ తీసుకువస్తున్న విషయం తెలిసిందే…
previous post
next post