telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై కేంద్రానికే విజయసాయిరెడ్డి హెచ్చరిక !

ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ స్టీల్‌ ప్లాంటు పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో ఇవాళ 25 కిమీల పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర నుంచి స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ వరకు విజయసాయి పాదయాత్ర చేస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ఉండగా… విజయసాయిరెడ్డి పాదయాత్రలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అనేక త్యాగాల ఫలితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని.. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేనని పేర్కొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం జగన్‌ మాట ఇస్తే తప్పరని తెలిపారు. విశాఖ ఉక్కు కేంద్ర సంస్థ అయినప్పటికీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని.. పార్లమెంట్‌ లోపల బయట పోరాటం చేస్తున్నామని వెల్లడించారు విజయసాయిరెడ్డి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం శక్తివంచన లేకుండా స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాటం చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారని..విమర్శించే రాజకీయ నాయకులు పోరాటంలో కలిసి రావాలన్నారు.

Related posts