telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

రోజు గుప్పెడు పల్లెలతో.. గుండె సమస్యలు దూరం..

no heart attack with 30gms of peanuts consumption

ఏమి తోచినప్పుడు గుప్పెడు పల్లీలు వేయించుకొని, దానిలో చిన్న బెల్లం గడ్డ నంజుకుంటూ తినేయడం గతంలో మాట. ఇప్పుడు ఒక్క ఫోన్ కొడితే ఇంటికే వచ్చిపడే ఆహారపడకం కాలం. దీనితో ఆరోగ్యం కూడా అలాగే ఊగిసలాడుతూ ఉండే స్థితిలోనే ఉంటున్నారు దాదాపు అందరూ. కానీ పల్లీలు తినడంతో పలు ప్రయోజనాలతో పాటుగా, గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని వైద్యనిపుణులు నొక్కివక్కాణిస్తున్నారు.

ఈ పల్లెలతో మ‌నం అనేక రకాల వంట‌ల‌ను చేసుకుంటుంటాం. కొంద‌రు ప‌ల్లీల‌తో ప‌చ్చ‌డి, ఫ్రైలు చేసుకుని తింటారు. కొంద‌రు వీటితో ర‌క ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని ఆర‌గిస్తారు. అయితే కేవ‌లం రుచికే కాదు, ఆరోగ్యాన్ని అందించ‌డంలోనూ ప‌ల్లీలు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా.. ప‌ల్లీల‌ను నిత్యం గుప్పెడు మోతాదులో తింటుంటే హార్ట్ ఎటాక్ లు రావ‌ని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది.

నిత్యం 30 గ్రాముల మోతాదులో ప‌ల్లీల‌ను తీసుకుంటే గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు, సైంటిస్టులు చెబుతున్నారు. ప‌ల్లీల్లో ఉండే మాంగ‌నీస్‌, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. మెద‌డు చురుగ్గా మారుతుంది. ఒత్తిడి త‌గ్గుతుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు కూడా రావ‌ని, ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

క‌నుక ఎవ‌రైనా నిత్యం ప‌ల్లీల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు.

Related posts