ఒరియా నటి సిమ్రన్ సింగ్ మృతి చెందారు. ఆమె శరీరం మహానది ఒడ్డున పోలీసులకు దొరికింది. అయితే ఆమె శరీరంపై ముఖ్యంగా తలపై, ముఖంపై గాయాలు ఉన్నాయి. ఆమె మృతదేహం దగ్గరలో ఒక లెదర్ బ్యాగ్ లభ్యమైంది. ఆమెను తన భర్తే హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విషయమై ఆమె భర్త మాట్లాడుతూ సిమ్రన్ మృతి విషయం తనకు అసలు తెలియదని, ఆమెను తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తమ ప్రేమకు రెండు వైపుల పెద్దలు ఒప్పుకోకపోవడంతో వేరేగా కాపురం పెట్టామని, గతకొంతకాలంగా తమమధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ వేరుగా ఉంటున్నట్టు స్పష్టం చేశాడు. అయితే సిమ్రన్ గతంలో కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందని, ఆ విషయాన్నీ తన కుటుంబ సభ్యులకు తెలిపానని, సిమ్రన్ తన సహనటులతో కలిసి హోటల్స్ వెళ్లడం తనకు నచ్చేది కాదని, ఆ విషయమే వారిద్దరి మధ్య గొడవలకు కారణమైందని పోలీసులకు తెలిపాడు సిమ్రన్ భర్త. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#LISTEN to what Sambalpuri album actress #SimranSingh said in her last audio message; her body was found dead yesterday #Sambalpur #Odisha pic.twitter.com/d4SUN2QPoD
— Kalinga TV (@Kalingatv24x7) January 4, 2019
ఇక సిమ్రన్ శవం దొరకడానికి కొన్ని గంటల ముందు ఆమెకు సంబంధించిన వాయిస్ ఓవర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో తాను చాలా అలిసిపోయానని, త్వరలోనే ఈ ప్రపంచాన్ని విడిచిపోతున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక సిమ్రన్ సింగ్ సిమ్రన్ సంబలపురి ఆల్బమ్స్ సెల్ఫీ బెబో, రిక్షా వాలా, రిమ్ జిమ్, మోర్ గర్ల్ ఫ్రెండ్-2, దిల్ కా రాజా, డిజే బాబు రిటర్న్ లో నటించి పాపులర్ అయ్యింది.