telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తల్లిదండ్రులను మరవకు మిత్రమా..

అన్నీ మరిచినా ఫరవాలేదు తల్లిదండ్రులను మరవద్దు మిత్రమా..
నీ జన్మ కొరకు రాళ్లకు మొక్కి-పూజలెన్నో చేశారు మిత్రమా..
నీవై రాతివై తల్లిదండ్రుల గుండెలను పిండి చేయకు మిత్రమా..
తమ నోటి కూడు నీకు పెట్టి నిన్ను పెంచి పెద్ద చేశారు మిత్రమా..
అమృతము ఇచ్చిన వారిపై విషమును చిమ్మబోకు మిత్రమా..
ఎంత గారాబము చేసిరి..ఎన్ని కోరికలు తీర్చిరి,
వారి కోరికలు తీర్చుట మాత్రము మరవద్దు మిత్రమా…
లక్షలెన్ని సంపాదించినా గానీ తల్లిదండ్రులకంటే ఎక్కువా?
సేవ లేక అంత వ్యర్థము మిత్రమా..
తాము తడినేల పడుకొని నిన్ను పొడినేల పరుండ బెట్టిన,
అమ్మ అమృత కన్నుల నుండి ఎన్నడూ తడిబారనీకు మిత్రమా..
నీ మార్గములో ప్రతి నిమిషం పూలు జల్లిన వారికి
వారి మార్గమున ఎన్నడూ నీవు ముళ్లను పరువబోకు మిత్రమా..

Related posts