హైదరాబాద్ లోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియోలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కొంత సమయానికే అన్నపూర్ణ స్టూడియో లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పిల్సల్చుకున్నారు. ఈ ఘటనలో ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదని యాజమాన్యం పేర్కొంది.
ఓ మూవీ షూటింగ్ కోసం వేసిన సెట్ లో షార్ట్ సర్క్యూరిటీ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ అగ్ని ప్రమాదం లో ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ ప్రేక్షకులకు ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ ప్రమాదం బిగ్ బాస్ సెట్టు కుడి వైపున జరిగింది. బిగ్ బాస్ సెట్టుకు ఈదిన జరిగిందా అనే ఆందోళనలో ప్రేక్షకులున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.