telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రియాపై కేసు… “ట్రూత్ విన్స్” అంటూ సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ సంచలన పోస్ట్

Ankitha

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య విషయంలో తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్… సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పై కేసు పెట్టి అందరికీ షాకిచ్చారు. రియాతో పాటు సుశాంత్ స్నేహితులు ఆరుగురిపై కేకే సింగ్ ఫిర్యాదు చేసారు. రియా సుశాంత్ ఆత్మహత్యకు 6 రోజుల ముందే అతడి ఫ్లాట్ ఖాళీ చేసిందని, నగలు, 15 కోట్ల డబ్బు సుశాంత్ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసుకుందని ఆరోపించారు. కాగా తాజాగా రియా పై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసిన తరవాత అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ చర్చకు దారి తీస్తోంది. అంకిత తన ఇన్స్టాగ్రామ్ లో “ట్రూత్ విన్స్” సత్యానిదే విజయం అంటూ పోస్ట్ చేసింది. దాంతో రియా, సుశాంత్ మధ్య జరిగింది అంకితకు తెలిసే ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. అంకిత సుశాంత్ తో కలిసి 2009 లో ఒక సీరియల్ లో కలిసి నటించింది. కాగా అప్పటినుండి ప్రేమలో ఉన్న అంకిత, సుశాంత్ లు 2016 లో విడిపోయారు.

Related posts