హైద్రాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇస్తున్నట్టు తెలంగాణ మంత్రి కె. తారక రామారావు అన్నారు. అందుకనుగుణంగా ప్రధాన రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించేందుకు నగర వ్యాప్తంగా 137 లింక్‌రోడ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. మిస్సింగ్ లింక్‌రోడ్లకు ఎక్కువమొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఈలింక్ రోడ్లతో అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతుందన్నారు.
సనత్‌నగర్, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రూ. 68.30 కోట్లతో నిర్మించనున్న నాలుగులేన్‌ల రైల్వే అండర్ బ్రిడ్డి పనులకు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రైల్వే అండ్ బ్రిడ్జి నిర్మాణంతో సనత్‌నగర్, నర్సాపూర్‌చౌరస్తా, జీడిమెట్ల మధ్య ప్రయాణించే లక్షలాది మంది ప్రజలకు ఊరట అభిస్తుందన్నారు.
చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి : ఉమ్మారెడ్డి