telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

బాలాకోట్ దాడిలో 170 మంది ఉగ్రవాదులు మృతి : ఇటలీ జర్నలిస్ట్

Balakot, Pak Attack

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 130 నుంచి 170 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్‌ జర్నలిస్ట్‌ ఫ్రాన్సెస్కా మారినో తెలిపారు. వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ చెబుతుండగా, ఒక్కరు కూడా చనిపోలేదని పాక్ వాదిస్తోంది. మృతుల సంఖ్యపై భారత వైమానిక దళం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మరోవైపు దాడులు జరగనే లేదని, జరిగి ఉంటే సాక్ష్యాలు వెల్లడించాలంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్సెస్కా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.

భారత దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని శింకియారీకి తరలించి చికిత్స అందించిందని మారినో తన కథనంలో పేర్కొన్నారు. దాడిలో గాయపడిన వారిలో 45 మంది ఇప్పటికీ అక్కడ చికిత్స పొందుతున్నారని తెలిపారు. చికిత్స పొందుతూ 20 మంది ప్రాణాలు విడిచారని మారినో వివరించారు. కోలుకున్న ఉగ్రవాదులు మాత్రం పాక్ ఆర్మీ అదుపులో ఉన్నట్టు తెలిపారు. భారత దాడిలో చనిపోయిన వారిలో చనిపోయిన ఉగ్రవాదుల్లో 11 మంది శిక్షకులు అని పేర్కొన్నారు.

Related posts