telugu navyamedia
సినిమా వార్తలు

“వి” సెట్లో వెన్నెల కిషోర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

Vennela-Kishor

“వీ” చిత్రం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. థాయ్ ల్యాండ్‌లో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. 1980 సెప్టెంబర్ 19న జన్మించిన వెన్నెల కిషోర్ నేడు 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా వీ చిత్ర బృందం ఆయ‌న‌తో కేక్ క‌ట్ చేయించి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్ జ‌రిపారు. వెన్నెల కిషోర్ ఈ చిత్రంలోను తన కామెడీతో క‌డుపుబ్బ న‌వ్వించున్నాడ‌ట‌. 2005లో విడుదలైన వెన్నెల చిత్రంతో వెండితెరకు పరిచయమైన వెన్నెల కిషోర్ దశాబ్దానికి పైగా అనేక చిత్రాలలో నటించి, తన హాస్యంతో ఆ చిత్ర విజయాలలో కీలకపాత్ర వహించారు. ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం, అలీ, సునీల్‌, ఎంఎస్ నారాయ‌ణ వంటి స్టార్ కమెడీయ‌న్స్ తమ కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించేవారు. ఈ జ‌న‌రేష‌న్‌లో ద‌ర్శ‌కుల‌కి కనిపిస్తున్న‌ ఏకైక ఆప్ష‌న్ వెన్నెల కిషోర్ అని చెప్ప‌వ‌చ్చు. వెన్నెల కిషోర్ కోసం స‌ప‌రేట్ కామెడీ ట్రాక్ రెడీ చేస్తున్నారు నేటి ద‌ర్శ‌కులు. స్టార్ హీరోల సినిమాల‌లోను వెన్నెల కిషోర్ న‌వ్వుల జ‌ల్లు కురిపిస్తున్నాడు.

Related posts