రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారికి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ కోసం చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు రావాలని మల్కాపురం, వెలగపూడి రైతులకు నోటీసులు పంపారు. దాదాపు 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి.
ఈ నేపథ్యంలో, అమరావతి ప్రాంతంలో ఈ నోటీసులు కలకలం రేపుతున్నాయి. మరోవైపు, రైతుల ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. నేటి నుంచి గ్రామాల్లో సకలజనుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, గ్రామాల్లో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అత్యవసర సేవలందించే ఆసుపత్రులు, మెడికల్ షాపులకు మినహాయింపును ఇచ్చారు.
కేసీఆర్ అదనంగా ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా?: పొన్నాల