విశాఖ తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ రాజీనామా చేశారు. ఎన్నార్సీతో పాటు రాజధానిపై టీడీపీ వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిగా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆశించిన అభివృద్ధి చేయలేకపోయారని చెప్పారు. టీడీపీ నేత నారా లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. లోకేశ్ రాకతో పార్టీ మొత్తం దెబ్బతిన్నదని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేశ్ తీరుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని రెహమాన్ తెలిపారు.
ప్రజల జీవితాలతో “కేసీఆర్ అండ్ కో” ఆడుకుంటున్నారు: విజయశాంతి