telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

2020లో ఇంకా ఏమేం చూడాల్సి వ‌స్తుందో… రానా పెళ్లిపై నాని రియాక్షన్

Nani

ఆమె ఎస్ చెప్పింది’ అంటూ సినీ నటుడు రానా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు రానా ప్రకటించాడు. రానా త‌న ప్రేమ గురించి అధికారికంగా తెలియ‌జేస్తూ ఆమెతో తానున్న ఫొటోను షేర్ చేశారు. అంటే త్వ‌ర‌లోనే రానా, మిహీకా బ‌జాజ్ త్వ‌ర‌లోనే పెళ్లిచేసుకోనున్నారు. దీంతో సినీ ప్ర‌ముఖులంద‌రూ రానా, మిహీకాకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో నేచుర‌ల్ స్టార్ నాని చేసిన ఫ‌న్నీ ట్వీట్ అంద‌రినీ ఆకట్టుకుంటోంది. ‘2020లో ఇంకా ఏమేం చూడాల్సి వ‌స్తుందో.. ఈ సంద‌ర్భంగా నీకు ఈ సాంగ్‌ను డేడికేట్ చేస్తున్నాను (బజాజ్ యాడ్‌ను పోస్ట్ చేశాడు నాని). జోక్స్ ప‌క్క‌న పెడితే సూప‌ర్ హ్యాపీ బాబాయ్‌’ అని అభినంద‌న‌లు తెలిపారు నాని.

Related posts