దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులు బీజేపీ తక్కువ మెజారిటీ తో గెలిచింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిపై రఘనందన్‌రావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 61302 ఓట్లు, కాంగ్రెస్ 21819 ఓట్లు, బీజేపీ 62,772 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బాంక్స్‌ల్లో ఉన్న ఓట్లల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ విజయం రఘనందన్‌రావునే వరించింది. దుబ్బాక విజయంతో బీజేపీలో నూతన ఉత్సాహం, అటు రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు జరుగనున్నాయి. ఇక దుబ్బాక విజయంతో బీజేపీ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. అయితే..దుబ్బాక ఎన్నికలో బిగ్ బాస్ బ్యూటీ, ప్రముఖ యాంకర్ కత్తి కార్తీక పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ ఉప ఎన్నికల్లో ఆమెకు దుబ్బాక ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికలో ఆమెకు కేవలం 620 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైంది. ఇది ఇలా ఉండగా..ఆమె జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పోటీచేస్తానని ప్రకటించింది.
previous post
ఆ పెద్దరికం గురువు దాసరితోనే పోయింది: మోహన్ బాబు