telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగులో కేకే పాడిన విర‌హ గీతాలు ఇవే..

ప్ర‌ముఖ బాలీవుడ్ సింగర్​ కేకే అలియాస్ ​ కృష్ణకుమార్​ కున్నాత్‌(53) మంగళవారం రాత్రి కోల్​కతా స్టేజ్ షో తర్వాత​ గుండెపోటుతో కన్నుమూశారు. బాలీవుడ్​తో పాటు మొత్తం 11 భాషల్లో 800 దాకా పాటలు పాడారు ఆయన. తెలుగులో అయితే కేకే పాడిన ఎన్నో పాటలు సూపర్‌హిట్స్‌ అందుకున్నాయి.

 టాలీవుడ్​లో కేకే పాడిన సూపర్‌హిట్స్ సాంగ్‌..

1994లో వచ్చిన డబ్బింగ్ సినిమా ప్రేమదేశంలో కాలేజ్ స్టైల్, హలో డాక్టర్ లాంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో తెలుగులో ఆయన ప్రస్థానం మొదలైంది.

ఆ త‌రువాత  ‘ఏ మేరా జహా (ఖుషీ), సున్‌సున్‌ సోనారే-పాటకి ప్రాణం(వాసు), దేవుడే దిగి వచ్చినా(సంతోషం), దాయి దాయి దామ్మా(ఇంద్ర), ఐ యామ్​ వెరీ సారీ (నువ్వే నువ్వే), నాలో నువ్వొక సగమై(జానీ), సీఎం పీఎం అవ్వాలన్నా(దిల్​), ఫీల్​ మై లవ్​(ఆర్య), చైల చైలా(శంకర్​ దాదా ఎంబీబీఎస్​), లే లే లేలే(గుడుంబా శంకర్​), ఇంతే ఇంతింతే..(బాలు ఏబీసీడీఎఫ్​జీ), అవును నిజం(అతడు), హే జానా..(జై చిరంజీవా), ఎగిరే మబ్బులలోనా(హ్యాపీ), ఒక చిన్ని నవ్వే నవ్వి(అశోక్​),   కొండకాకి కొండెదాననా (అపరిచితుడు) పేరు చిన్నా(రణం), మై హార్ట్ ఈజ్​ బీటింగ్​(జల్సా).. వంటి హుషారెత్తించే పాట‌లు పాడారు.

విషాద గీతాలు..

ఎవ్వరినెప్పుడు తన వలలో..(మనసంతా నువ్వే), నీ కోసమే నా అన్వేషణ.(నువ్వు నేను), ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా..(జయం), ఊరుకో హృదయమా..(నీ స్నేహం), చెలియ చెలియా..(ఘర్షణ), గుర్తుకొస్తున్నాయి..(నా ఆటోగ్రాఫ్​), తలచి తలచి (7జీ బృందావన్​ కాలనీ), ఆంధ్రుడు (ఓసారి ప్రేమించాక..), అనగనగనా ఒక..(ఔనన్నా.. కాదన్నా..), వెళ్తున్నా వెళ్తున్నా..(బాస్​), వెయిటింగ్​ ఫర్​ యూ(ఓయ్​), ఉప్పెనంత ఈ ప్రేమకు..(ఆర్య 2), మనసంతా ముక్కలు చేసి(ప్రేమ కావాలి), ఓ సాథియా(నా ఇష్టం), చెలియా చెలియా..(ఎవడు) లాంటి పాటలు పదే పదే వినిపిస్తుంటాయి.

2014లో హిందీ సినిమా ఆషికి 2కి రీమేక్‌గా తెరకెక్కిన నీ జతగా నేనుండాలి సినిమాలో పాడిన ‘కనబడునా’ అనేది కేకే చివరి పాట. భౌతికంగా మనకు దూరమైనా కేకే తన పాటల ద్వారా ఎప్పుడూ మనతోనే ఉంటారు..ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతి.

Related posts