సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వేధిస్తున్నారని ప్రముఖ నటి, యాంకర్ అనసూయ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇటీవల కొంత కాలంగా తన చిత్రాలను మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేస్తున్నారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
తన సోషల్ మీడియా ఖాతాలకు వచ్చిన కామెంట్లను జతచేస్తూ, అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ విభాగం, దర్యాఫ్తును ప్రారంభించింది. కాగా, ఇటీవలి కాలంలో అనసూయ న్యూడ్ ఫొటో అంటూ, ఓ చిత్రం హల్ చల్ చేయగా, అది తన చిత్రం కాదని వివరణ ఇస్తూ, ఒరిజినల్ చిత్రాన్ని ఆమె విడుదల చేసిన సంగతి తెలిసిందే.