ఈ నెల 17న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పుట్టిన రోజున ..ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటండని మంత్రి కేటీఆర్, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయింది. “2020, ఫిబ్రవరి 17న గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 66 ఏళ్లు రాబోతున్నాయి. హరిత హారం అంటే ఆయనకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు.
కాబట్టి అందరు టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి మన నేత జన్మదిన వేడుకలను జరుపుతోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటండి” అని కేటీఆర్ ట్విటర్ లో వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు ఆఫర్!