బీసీసీఐ పై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశాన్ని కారణంగా చూపుతూ ద్రావిడ్‌కు బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డీకే జైన్ నోటీసులు పంపడంపై గంగూలీ మండిపడ్డారు. ఇదే విషయంపై దాదా ట్విటర్‌లో స్పందిస్తూ.. విరుద్ద ప్రయోజనాల అంశం.. భారత క్రికెట్లో కొత్త ఫ్యాషన్ అయింది. ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఇదో సులభమైన మార్గం. భారత క్రికెట్‌ను ఇక ఆ దేవుడే కాపాడాలి.
గంగూలీ కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలను ఎదుర్కొంటుండటం విశేషం. ఇటీవలే ద్రావిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఇండియా సిమెంట్స్‌లోనూ అతడు వైస్‌ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఈ పదవిని చేపట్టడంతో విరుద్ధ ప్రయోజనాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
మోదీ కారణంగానే చంద్రయాన్-2లో వైఫల్యం.. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు