telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మరో అత్యాచారం.. ఇద్దరు మైనర్లే.. చట్టం ఏమి చేస్తుందో..

minor raped child in visakha

ఎన్ని చట్టాలు తెచ్చినా స్త్రీలపై అత్యాచారాలు మాత్రం ఆగటంలేదు. తాజాగా, విశాఖపట్టణం పరిధిలోని ప్రహ్లాదపురంలో దారుణం జరిగింది. పక్కింట్లో నివసించే ఏడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ నెల నాలుగో తేదీన ట్యూషన్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు.

అనుమానం వచ్చి పక్కింట్లో వెతికారు. ఆ సమయంలో బాలుడు, బాలిక ఇద్దరే అక్కడ ఉన్నారు. దీంతో బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు.

Related posts