telugu navyamedia
సినిమా వార్తలు

భ‌ర‌తుడు పాత్ర‌లో అల్లు అర్హ‌..!

యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హకి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ‌నే చెప్పొచ్చు. తన ముద్దు ముద్దు మాటలు, అల్ల‌రి చేష్టలతోఅంద‌రిని ఆకట్టుకుంది. త‌న తండ్రికి మించిన త‌న‌య అనుపించుకుంటుంది. తాజాగా అల్లు అర్హకి సంబంధించిన మేకప్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో ‘శాకుంతలం’ సినిమా ఒకటి. సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ రూపొందిస్తున్నాడు. సమంత శకుంతలగా, ఆమెకి జంటగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. గుణ శేఖర్ సొంత నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇందులో అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడి పాత్రల్లో నటిస్తున్న సమంత, దేవ్ మోహన్ ల కొడుకు భరతుడు పాత్రలో అర్హ నటిస్తోంది. అందులోని భాగంగా షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ క్రమంలో శాకుంతలం టీం అర్హ కి గ్రాండ్ గా వెల్కం చెప్పారు. అర్హ క్యూట్‌గా మేకప్ వేసుకుంటున్న‌ వీడియోను సోషల్ మీడియాలో అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.

కాగా పౌరాణిక గాధ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు. దాదాపు స‌గానికి పైగే షూటింగ్ పూర్తయిన‌ట్టు చెబుతున్నారు. సినిమా మీద అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related posts