telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తండ్రి అయిన సందీప్ రెడ్డి వంగా

Sandeep-Reddy-VAnga

 ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తండ్రి అయ్యాడు. సందీప్ భార్య మనీషా రెడ్డి గురువారం (ఫిబ్రవరి 27) పండంటి ఆడ్డబిడ్డకు జన్మనిచ్చారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసాడు సందీప్ అతని టేకింగ్ అండ్ డేర్ అటెంప్ట్‌కు సినీ పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. ఇదే సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ దర్శకత్వంలో రీమేక్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సందీప్ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే సందీప్ రెడ్డి తన తర్వాతి సినిమా హిందీలో చేస్తాడని, లేదా తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సందీప్ తండ్రి అయ్యాడని తెలిసి పలువురు సన్నిహితులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Related posts