telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య వెనుక మహేష్ భట్ ప్రమేయం ?

Mahesh BHatt

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ మృతికి కొందరు బాలీవుడ్ ప్రముఖులే కారణం అంటున్నారు. కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్, అలియా భట్, కరీనా కపూర్ వంటి వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మహేష్ భట్‌పై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సుశాంత్ మృతి వెనుక మహేష్ భట్ ప్రమేయం ఉందని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రియా చక్రవర్తితో సంబంధం ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సుశాంత్, రియా చక్రవర్తి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. నవంబర్లో వీరిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. ఈలోగా ఇలా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నువ్వు నాతో ఉంటే మహేష్ భట్ నన్ను చంపేస్తాడని రియాతో సుశాంత్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సుశాంత్ మరణం వెనుక మహేష్ భట్ పాత్ర ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా మహేష్ భట్ కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పిన సంగతిని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.

Related posts