telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇంటర్‌ విద్యార్థిని..

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ 11 గంటల సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలు బాధ్యతలు తీసుకున్నారు. ‘బాలికే భవిష్యత్తు” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్‌ విద్యార్థిని ఎం.శ్రావణి ఎంపికైంది.

జిల్లా కలెక్టర్ గా ఆమె ఇవాళ బాధ్యతలను నిర్వహిస్తుంది. చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో పదవీ ఉండనుంది. అంతేకాదు…ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేలు పరిహారం అందించే ఫైల్ పై ఒక రోజు కలెక్టర్ శ్రావణి సంతకం చేసింది. రాత్రి 8 గంటల తర్వాత ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులను అధికారిక పనుల గురించి ఫోన్ లు చేసి ఆటంకం కలిగించకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ఫైల్ పై సంతకం చేసింది శ్రావణి. 

Related posts