telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చెవిరెడ్డి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన జగన్: తుడా ఛైర్మన్‌గా ప‌ద‌వికాలం పొడిగింపు..

 

*చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నో ఛాన్స్‌..
*చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంత్రి ప‌దవి లేన‌ట్లే..

*తుడా చైర్మ్‌న్‌గా మ‌రో రెండేళ్లు ప‌ద‌వికాలం పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ..
* ఈ నెల 12 నుంచి రెండేళ్ళు పాటు కొన‌సాగునున్న‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

సీనియర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంత్రి ప‌దవి లేన‌ట్లే.. తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ రేసులో వున్న చెవిరెడ్డిని తుడా ఛైర్మన్‌ పదవితో సరిపెట్టింది జగన్ ప్రభుత్వం.

ఏప్రిల్‌ 11న మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో అంతకు ముందే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పదవి కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వైఎస్సార్ హయాం నుంచి ఆ కుటుంబంతో…జగన్ పార్టీ ఏర్పాటు తరువాత ఆయనతోనూ చెవిరెడ్డి విధేయుడుగా..సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు..రెండో సారి విస్తరణలో కేబినెట్ లో ఛాన్స్ దక్కుతుందని అంచనా వేసారు.

కానీ, ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో 2024 వరకూ చెవిరెడ్డికి మంత్రిగా అవకాశం లేనట్లే. దీంతో..చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో కేబినెట్ విస్తరణ ద్వారా కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు..మొత్తం 35 మందితో కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారట సీఎం జగన్. అయితే, పాత మంత్రుల్లో కొంత మందిని కొనసాగించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా 25 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు .

బీసీలు, ఇతర వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మంత్రి పదవులు కోల్పోయే ఎమ్మెల్యేలకు కీలకమైన పార్టీ బాద్యతలను జగన్ అప్పగించనున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మంత్రి వర్గ కూర్పు, ఇతర ఎమ్మెల్యేలకు పార్టీ బాధ్యతలు ఉంటాయని భావించవచ్చు.

 

Related posts