telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

maoist naksals

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టు పార్టీపై మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా భద్రతా చట్టం 1992 కింద ఆగస్టు 17 నుంచి మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది.

మావోయిస్టు పార్టీతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న రైతు కూలీ సంఘం, విప్లవ కార్మిక సమాఖ్య, సింగరేణి కార్మిక సమాఖ్య, ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్, ర్యాడికల్ యూత్ లీగ్, రివల్యూషనరీ డెమొక్రాటిక్ ఫ్రంట్ తదితర సంస్థలకు కూడా నిషేధం వర్తించనుంది. ఈ నేపథ్యంలో 1991 నుంచి ఈ సంస్థలపై ప్రతీ ఏటా నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది.

Related posts