telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నర్సులకు ఈ సమాజం ఎంతో రుణపడి ఉంది: చంద్రబాబు

chandrababu

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. సేవాభావానికి ప్రతిరూపం నర్సులు, వైద్య సిబ్బంది అంటూ ప్రశంసలు కురిపించారు. తన అద్వితీయ సేవలతో నర్సు వృత్తికి ఎంతో గౌరవాన్ని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు.

ఈ సందర్భంగా అంకితభావంతో పేషంట్లకు సేవలందిస్తోన్న నర్సులందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నానంటూ వరుస ట్వీట్లు చేశారు. బాధిత రోగులకు వేళ తప్పకుండా మందులతో పాటు ఆత్మీయంగా సేవలు అందించే నర్సులు కదిలే ధవళ దేవతలు అని కొనియాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నర్సులు తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు.

Related posts