telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అవ‌స‌ర‌మైతే త‌న ప‌ద‌వి రాజీనామా చేస్తా..మీరు చేస్తారా? ..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజ‌కీయాలు మ‌రింత వేడి పుట్టిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే సైతం హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ మరో ఉద్యమానికి నాంది పలికారు. ఈ మేరకు హిందూపురం లో బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు. ముందు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు టీడీపీ శ్రేణులు, జిల్లా మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

Nandamuri Balakrishna: అవసరమైతే రాజీనామాకు సిద్ధం.. నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్..

అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్‌ కూడలిలో బాలకృష్ణ మౌన దీక్ష కు కూర్చున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సంచలన కామెంట్స్.. చేశారు.

హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే.. తాను రాజీనామా చేస్తానని.. వైసీపీ ప్రజా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ సవాల్‌ విసిరారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాల్సిందేనని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని.. అన్ని వసతులున్నందునే ఈ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు.

Related posts