telugu navyamedia
సినిమా వార్తలు

బుల్లెట్టు బండి పాటకు ఇర‌గ‌దీసిన బామ్మ‌

బుల్లెట్టు బండి పాట హవా కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో బుల్లెట్ బండి సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అంద‌ర‌కి తెలిసిందే. ఇప్పుడు ప్రతి పెళ్లిలో ఈ డ్యాన్స్ కంపల్సరీ అయ్యింది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్‌ అయ్యే వరకూ ఎక్కడ చూసినా ‘డుగ్గు డుగ్గు’ అంటూ ఒకటే మ్యూజిక్‌ వినిపిస్తోంది .సామాన్య ప్రజలే గాక సెలబ్రిటీల సైతం ఈ పాటకి చిందేస్తున్నారు.

పెళ్లి వేడుకల్లోనే కాకుండా పాఠశాల గదుల్లో, ఆస్పత్రి వార్డుల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇలా ఈ పాటకు ఎవరు డ్యాన్స్ చేసిన సరే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే పెళ్లి కూతురు, చిన్న పిలల్లేనా? నేను ఎందుకు కాదంటూ ఓ బామ్మ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. అది కూడా మామూలుగా కాదు. .యంగ్ పిల్లల కన్నా కూడా ఈ బామ్మ వేసిన స్టెప్స్ అదిరిపోతున్నాయి.

ఫుల్ ఎనర్జిటిక్ డాన్స్‌..

ఈ వీడియోలో దాదాపు 60 ఏళ్లకు పైన ఉన్న బామ్మ బుల్లెట్ బండి సాంగ్ కి అద్భుతమైన స్టెప్స్ వేసింది. మంచం మీద భర్త కూర్చొని ఉండగా..సరిగ్గా సాంగ్ రిథమ్ కు తగినట్లుగా ఆమె డ్యాన్స్ చేసింది. ఐతే అతను కూడా తన భార్య డ్యాన్స్ చూసి కదలకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు. కాసేపైతే షాక్ కు గురయ్యాడు. ఈ డ్యాన్స్ చూసిన వాళ్లంతా బామ్మ నువ్వు సూపర్ అంటున్నారు. ఈ డ్యాన్స్ చూసిన వాళ్లంతా బామ్మ నువ్వు సూపర్ అంటున్నారు. మరికొందరు ‘బామ్మ నువ్వు గ్రేట్‌’ ఇంత ఎనర్జిటిక్ ఎలా సాధ్యమైందంటున్నారు. నిజంగానే ఈ బామ్మ బుల్లెట్ బండి పాటని ఇర‌గ‌దీసింది.

Related posts