పంక్చువాలిటీ గురించి చాలా జోకులు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.. ముఖ్యమైన కార్యక్రమాలకు సైతం నిర్ణయించిన సమయానికి హాజరుకాకపోవడం మనవాళ్ల ప్రత్యేకత.. గంటలకు గంటలు లేటు చేసే వాళ్లకు ఐదు నిమిషాలు, పది నిమిషాల ఆలస్యం అసలు లెక్కే కాదు. కానీ రూల్స్ ఫాలో అయ్యేవారికి ఇలాంటి లేటు అంటే మహా చిరాకు. అందుకే హైదరాబాద్ లో ఓ ప్రేక్షకుడు ముందుగా ప్రకటించిన సమయం కంటే 15 నిమిషాలు సినిమా ఆలస్యంగా సినిమా ప్రదర్శించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినియోగదారుల ఫోరానికి సైతం వెళ్లారు.
విషయానికి వస్తే, కాచిగూడ ఐనాక్స్ మల్టీప్లెక్స్ లో గేమ్ ఓవర్ సినిమా చూసేందుకు విజయగోపాల్ అనే వ్యక్తి వచ్చారు. సాయంత్రం 4 గం.కు సినిమా ప్రారంభించాల్సి ఉండగా.. 4.45ని.లకు షో వేశారు. నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో విజయగోపాల్ కు కోపం వచ్చింది. ఆయన హ్యాక్ ఐ సిస్టమ్ ద్వారా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేశారు.