telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య సీమంతం… ఆయన కటౌట్ పెట్టుకుని…!

Meghanaraj

కన్నడ నటుడు చిరంజీవి సర్జా గత కొన్ని నెలల క్రితం ఆకస్మికంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా. కన్నడలో సుమారు 22 సినిమాల్లో నటించిన ఆయన నటి మేఘనారాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఛాతీ నొప్పితో ఇంట్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే మేఘన గర్భవతిగా ఉన్నారు. తాజాగా మేఘన సీమంతం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. భర్త జ్ఞాపకాలతో బ్రతుకున్న మేఘన చిరంజీవి స్టైల్‌గా నుంచున్నట్లు కటౌట్ తయారుచేయించి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. ఈ సందర్భంగా “నాకెంతో ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులు. చిరు.. నువ్వు ఇలాగే కదా ఈ వేడుక జరగాలని కోరుకున్నావు. నువ్వు కోరుకున్న విధంగానే జరిగింది. ఇకపైనా జరుగుతుంది. ఐ లవ్‌ యూ బేబీ” అని పేర్కొన్నారు. మేఘన షేర్‌ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మేఘన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

 

View this post on Instagram

 

❤️

A post shared by Meghana Raj Sarja (@megsraj) on

Related posts