telugu navyamedia
సినిమా వార్తలు

ఆ వీడియో చూస్తూ హీరోయిన్ కు దొరికిపోయిన స్టార్ హీరో

AA19

ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా సెట్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చూశారు. ఎంతో ఉత్కంఠగా ఆయన మ్యాచ్‌ చూస్తుండగా తీసిన వీడియోను హీరోయిన్ పూజా హెగ్డే చూసి వెంటనే కాప్చర్ చేసేసారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. బన్నీ మొబైల్‌ ఫోన్‌లో మ్యాచ్‌ చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా కనపడనున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

#Alluarjun

A post shared by allu arjun fans (@allu_arjun444) on

Related posts