telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్రంప్ బాలయ్యను కాపీ కొట్టాడంట… సంతకాలపై ట్రోలింగ్

trump-balayya

ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు నెటిజన్లు. ట్రంప్ పర్యటనలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంపై నెట్టింట్లో పెద్ద చర్చేనడుస్తోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీల ప్రస్తావనతో పాటు.. బాలీవుడ్‌ చిత్రాలు దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, షోలే చిత్రాలను గుర్తు చేసుకోవడంతో వీటిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇక ట్రంప్ ఎక్కడ ఉంటే అక్కడ ట్రోలింగ్స్ ఉండటం కామనే.. అయితే ఆయన స్పీచ్‌లో దొర్లాడిన తప్పులపై ట్రోల్స్ ఓ రేంజ్‌లో వస్తుండగా.. సబర్మాతి ఆశ్రమంలో ట్రంప్ చేసిన సంతకంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఆయన సంతకాన్ని నందమూరి నటసింహం బాలకృష్ణ సంతకంతో పోల్చుతూ.. మా బాలయ్య బాబు సంతకాన్ని కాపీ కొట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరతీశారు. ట్రంప్ సంతకాన్ని, బాలయ్య సంతకాన్ని పక్కపక్కనపెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు .trump

 

Related posts