telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ పాత్ర ఒప్పుకుని పెద్ద తప్పు చేశా… రష్మీ కామెంట్స్

Rashmi

కరోనా ఎఫెక్ట్‌ తోలాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు. సినిమా, సీరియళ్ళ షూటింగులు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో జాగ్రత్తలు చెబుతూనే ఉంది. నెటిజన్లకు చాలా ఓపికగా అందరికీ తనదైన తరహాలో సమాధానాలు ఇస్తూనే ఉంది. ఇక ఈ సమయంలో మనుషులే కాదు జంతువులు కూడా ఆకలి బాధపడుతున్నాయని… తనే స్వయంగా ఆ జంతువులకు ముఖ్యంగా వీధి కుక్కలకు ఆహారాన్ని అందిస్తుంది. రష్మీ గౌతమ్ సినిమాల్లో సక్సెస్ కాకపోయినప్పటికీ బుల్లితెరపై హంగామా చేస్తోంది. మొదట చిన్నచిన్న పాత్రల్లో మెరిసిన ఆమె.. ఆ తర్వాత ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ యువ ఆడియన్స్ అందరినీ బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేసింది. కానీ అది వర్కవుట్ కాలేదు. బుల్లితెరపై రాణిస్తున్నా వెండితెర మాత్రం ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. యాంకరింగ్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించింది. ముఖ్యంగా జబర్దస్త్ బ్యూటీగా సూపర్ పాపులారిటీ సంపాదించింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి గల కారణాలు చెప్పింది రష్మీ. కాగా తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన రష్మీ.. బుల్లితెరపై తనకున్న క్రేజ్ వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టిందని, దాంతో ఒక్కో సినిమా చేస్తూ వెళ్లానని చెప్పింది. ఈ క్రమంలోనే ‘గుంటూరు టాకీస్’ సినిమా చేశానని, అయితే ఆ మూవీలో గ్లామర్ డోస్ ఎక్కువగా వడ్డించి సెక్సీ లుక్‌‌లో కనిపించడమే దెబ్బేసిందని చెప్పుకొచ్చింది. అలా చూసిన దర్శకనిర్మాతలంతా మళ్ళీ అలాంటి రోల్స్ మాత్రమే ఆఫర్ చేశారని తెలిపింది. దీంతో ఒకే తరహా రోల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వైవిధ్యభరితమైన పాత్రలను చేయాలనే తన ఆశ నిరాశ గానే మిగిలిపోయిందని రష్మీ చెప్పింది. ఆ పాత్ర ఒప్పుకుని తాను పెద్ద తప్పు చేశానని, ఇకపై అలాంటి పాత్రలను ఒప్పుకునేదే లేదని స్పష్టం చేసింది.

Related posts