telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్

Prabhas

“బాహుబ‌లి” చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. “బాహుబ‌లి” కోసం దాదాపు ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడు ప్ర‌భాస్. ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబ‌లి సిరీస్‌లో వ‌చ్చిన రెండు సినిమాల‌ త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్ ఖండాంత‌రాలు దాటింది. ఇప్పుడు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం వీరాభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ రోజు (బుధవారం) ప్రభాస్ జన్మదినోత్సవం. దీంతో అటు అభిమానులు, ఇటీ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా తాజాగా ప్రభాస్‌కు ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశారు. “బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రభాస్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని మంచి చిత్రాలలో నటించి, ప్రజలని ఆనందపరచాలని కోరుకుంటున్నాను” అని లోకేష్ ట్వీట్ చేశారు.

Related posts