telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అరెస్ట్… అభిమానులకు షాక్

Sonakshi-Sinha

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అరెస్ట్ అయింది. ఈ మేరకు మంగళవారం సోనాక్షి సిన్హా తన ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో సోనాక్షి సిన్హా చేతులకు పోలీసులు బేడీలు వేసి తీసుకెళ్తున్నట్టు ఉంది. అయితే సోనాక్షి ముఖాన్ని మాత్రం వీడియోలో చూపించలేదు. తననెందుకు అరెస్ట్ చేస్తున్నారని సోనాక్షి అడగడం మాత్రం వినిపించింది. దీంతో సోనాక్షిని ఎందుకు అరెస్ట్ చేశారు. అసలేమైంది.. అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చ పెట్టారు. దీంతో #AsliSonaArrested అనే హాష్ ట్యాగ్ విపరీతంగా వైరల్ అయింది. బుధవారం వరకు దీనిపై సైలెంట్‌గానే ఉన్న సోనాక్షి ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయమై సోనాక్షి సిన్హా స్పందిస్తూ “అవును నన్ను అరెస్ట్ చేశారు.. ఎందుకంటే.. మరీ ఇంత అందంగా కనిపించడం కూడా క్రైమ్ కిందే లెక్క. POSE కాస్మోటిక్ బ్రాండ్‌కి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు సంతోషిస్తున్నా” అంటూ మరో వీడియో ద్వారా వెల్లడించింది. దీంతో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. సోనాక్షి చేసిన ఈ పనికి POSE కాస్మోటిక్ ప్రొడక్ట్స్‌కి కావాల్సినంత ప్రచారం లభించింది. ఇక సోనాక్షి సినిమాల విషయానికొస్తే… తాజా సినిమా “ఖాందాని షఫఖానా” ప్రస్తుతం థియేటర్స్‌లో నడుస్తోంది. మరి భారీ ప్రాజెక్ట్ “మిషన్ మంగళ్”లో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, నిత్యా మీనన్ లతో సోనాక్షి సిన్హా కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ఆగుస్ట్ 15న విడుదల కానుంది.

Related posts