telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెటిజన్లను ఆకర్షిస్తున్న విరుష్క క్యారికేచ‌ర్

Anushka

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండగా… సెలెబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికి ప‌రిమిత‌మైన అనుష్క శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్‌గా పోస్ట్‌లు చేస్తూ నెటిజ‌న్స్‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందిస్తున్నారు. తాజాగా అనుష్క తన తాజా వెబ్‌ సిరీస్‌ ‘‘పాతాల్‌ లోక్‌’’ను టీవీలో చూస్తున్న స‌మ‌యంలో ఫోటో దిగి షేర్ చేసింది. పాతాల్ లోక్‌లో నీరజ్ కబీ, గుల్ పనాగ్, జైదీప్ అహ్లవత్, అభిషేక్ బెనర్జీ, స్వస్తిక ముఖర్జీ నటించారు.సుదీప్ శ‌ర్మ రాసిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో జ‌య‌దీప్ అలావ‌త్ పోలీస్ పాత్ర‌లో న‌టించ‌గా, ఆయ‌న పాత్ర‌కి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక అనుష్క షేర్ చేసిన పిక్ లో విరుష్క‌ల క్యారికేచ‌ర్ నెటిజ‌న్స్ దృష్టిని ఆక‌ర్షిస్తుంది. రెండు బొమ్మ‌ల మ‌ధ్య ఉన్న‌ విరుష్క క్యారికేచ‌ర్‌పై నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts