బాలీవుడ్ హీరోయిన్, పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ వయసు గురించి టీవీ నటుడు ఫిర్దాస్ జమాల్ కామెంట్స్ చేశారు. మహీరా వయసు గురించి ఫిర్దాస్ వ్యాఖ్యానిస్తూ.. “వయసు అయిపోయిన నటీమణులు తల్లి పాత్రల్లో నటించాలి. హీరోయిన్ పాత్రల్లో కాదు” అని అన్నాడు. ఆయన కామెంట్‌పై మహీరా ఖాన్ స్పందించింది. నేరుగా ఫిర్దాస్ పేరు ప్రస్తావించకుండా అతడికి పరోక్షంగా చురకలంటించింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మహీరా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక లేఖను పోస్ట్ చేసింది. “మనం వర్తమానంలో చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఓ నటిగా చిత్ర పరిశ్రమ పట్ల, నా పనితీరు పట్ల నేను గర్వపడుతున్నా. నా ఈ ప్రయాణంలో నాకు నచ్చిన విధంగానే ఉన్నానని గర్వంగా చెబుతున్నా. నాకు ఏది సరైందో నేనే నిర్ణయించుకుంటా. ఎదుటి వ్యక్తి చెబితే వినను. ఇకపై కూడా ఇలాగే ఉంటా. ఈ ప్రపంచం ద్వేషంతో నిండిపోయింది. మనం ప్రేమను పంచుదాం. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు” అంటూ మహిరా ఆ లేఖలో రాసింది.
previous post