telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బయటపెడుతాం: డీకే అరుణ

DK Aruna comments on congress

తెలంగాణ సర్కారు పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. శుక్రవారం బీజేపీ నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బయటపెడతామన్నారు. మున్సిపల్ ఎన్నికలను హడావుడిగా నిర్వహించాల్సిన అవసరం ఏంటని డీకే అరుణ ప్రశ్నించారు.

నాయకులు ఎదగకుండా కేసీఆర్ అణచివేత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు.దేశ ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు అని ఆమె అన్నారు. మోదీ, అమిత్ షా నాయకత్వం నచ్చే ప్రజలు ఓట్లు వేశారని గుర్తుచేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై అమిత్ షా దృష్టి పెట్టారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయంఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Related posts