telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“శ్రీరెడ్డి దొరికిపోయింది” మూవీ ఫస్ట్ లుక్

srireddy

శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాలీవుడ్‌లోని పెద్దపెద్ద వాళ్లపై తీవ్ర ఆరోపణలు చేసిందామె. టాలీవుడ్‌లో ఒక ఊపు ఊపేసి ప్రస్తుతం చెన్నైలో సేదతీరుతోంది. ఈ వివాదాస్పదమైన నటి పేరుపై ఇప్పుడో సినిమా వస్తోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. మానవ మృగాలకు అనేది ఉపశీర్షిక. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ సినిమాతో శ్రీరెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా టైటిల్‌లో ఆమె పేరును వాడటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక అమ్మాయి చేతిలో కత్తి, ఆమె ముఖంపై రక్తపు మరకలు, ఆమె ముఖంలో కోపం చూస్తుంటే ఇదేదో మగ మృగాలపై రివేంజ్ స్టోరీలా అనిపిస్తోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్‌ మూవీస్‌ పతాకంపై డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. గణేశ్‌ రాఘవేంద్ర సంగీతమందిస్తున్నారు.

Related posts