telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనకు దూరంగా ఉండండి… అప్పుడే అందరికీ మంచిది : రంగోలి

Rangoli-and-Karan-Johar

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు గణతంత్ర దినోత్సవం రోజున భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కంగనా రనౌత్ సోదరి రంగోలీ మరోసారి నిర్మాత కరణ్ జోహార్‌పై కామెంట్స్ చేశారు. యితే కంగన, కరణ్ ఇండస్ట్రీలో బద్ధ శత్రువులు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనకు శుభాకాంక్షలు చెబుతూ కరణ్ ఓ మాటన్నారు. ‘‘కంగన తాను నటించిన సినిమాలతో తన సత్తాను నిరూపించుకున్నారు. ఆమె పద్మశ్రీకి అర్హురాలే. ఓ ఆర్టిస్ట్‌గా ఆమె ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఆ గుణం నాకు చాలా నచ్చుతుంది. కంగనకు సరిపోయే కథ నా వద్ద ఉంటే కచ్చితంగా ఆమెకు ఫోన్ చేయడానికి ఏమాత్రం వెనుకాడను. నాకు, కంగనకు మధ్య శత్రుత్వం ఉంది చాలా మీడియా వర్గాలు రాశాయి. కానీ మేం ఏ ఈవెంట్‌లో కలుసుకున్నా కూడా చక్కగా పలకరించుకుంటాం. ఓ నిర్మాతగా కంగన టాలెంట్ అంటే నాకు గౌరవం. మా గురించి ఎవరు ఎన్ని రకాలుగా రాసినా కంగనతో కలిసి పనిచేయడానికి నేను ఏమాత్రం మొహమాటపడను’’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రంగోలీ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘కరణ్ జోహార్ ఎలా మాట్లాడుతున్నారంటే.. ఆయన ఫోన్ చేయగానే కంగన పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందన్నట్లు ఫీలవుతున్నారు. మీరు నేను అనుకుంటే అయిపోదు కదా సర్. కంగనకు కూడా స్క్రిప్ట్ నచ్చాలి కదా. కంగనను మెప్పించేంత స్క్రిప్ట్ మీ దగ్గర ఉందా? మీరు తెరకెక్కించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాను కంగన చూసింది. అందులో క్యాన్సర్‌తో బాధపడుతున్న అనుష్క శర్మను రణ్‌బీర్ కపూర్ వెంటపడుతుంటాడు. నీకు ఇప్పుడు ఎటూ క్యాన్సర్ ఉంది ఇక నువ్వు నాతోనే ఉండాలి అంటాడు. ఈ సన్నివేశం చూశాక కంగన చాలా సేపటి వరకు షాక్‌లో ఉంది. మీరు ఇలాంటి చెత్త స్క్రిప్ట్స్ తీసుకుని కంగన వద్దకు వస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. కాబట్టి దయచేసి కంగనకు దూరంగా ఉండండి. అప్పుడే అందరికీ మంచిది’ అని ఏకిపారేశారు.

Related posts