telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కరోనా రూల్స్ బ్రేక్ చేసిన రోనాల్డో… ఎందుకంటే…?

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తున్నాయి. అయితే ఈ వైరస్ కేసులు కొన్ని దేశంలో తగ్గుముఖం పడుతున్నప్పటికీ… కరోనాకు భయపడి ఇప్పటికీ యూరప్ లోని అనేక దేశాలు లాక్ డౌన్ విధించుకొని ఇంట్లో కూర్చుంటున్నాయి.  బ్రిటన్ తో పాటుగా ఇటలీ లో కూడా ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయ్.  అయితే, ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు, పోర్చుగల్ క్రీడాకారుడు క్రిష్టియనా రోనాల్డో కరోనా రూల్స్ ను బ్రేక్ చేశాడు.  తన గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని అనుకున్నాడు.  ఇటలీలోని టురిన్ నగరంలోని మౌంటెన్ రిసార్డ్స్ లో ఉంటున్నాడు.  ఇటలీలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు.  అయితే, వీటిని పట్టించుకోని ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిష్టియనా రోనాల్డో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొని 150 కిలోమీటర్ల లాంగ్ డ్రైవ్ కు వెళ్ళాడు.  కౌర్ముయుర్ కు వెళ్లారు.  అక్కడ అందమైన లొకేషన్స్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఆ తరువాత వెంటనే వాటిని డిలీట్ చేశారు.  కానీ, అప్పటికే క్రిష్టియనా రోనాల్డో ఫోటోలు వైరల్ అయ్యాయి.  అనేక వెబ్ సైట్స్ లో దర్శనం ఇచ్చాయి.  కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు ఇటలీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చూడాలి మరి రోనాల్డో పై ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది.

Related posts