telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు

నయీం కేసులో మరోసారి సంచలన విషయాలు బయటపెట్టింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నయీం ఇంట్లో 24 ఆయుధాలని పోలీసులు స్వాధీనం చేసుకోగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చే అనే విషయాన్ని విషయం చెప్పలేదన్నది ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌. 3 ఏకే-47, 3 రివాల్వర్ తొమ్మిది పిస్తోలు, 7 టాపాన్‌చాలు , ఒక స్టెన్ gun, రెండు grenades స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 5 కిలోల అమ్మోనియం నైట్రేట్, 6 మ్యాగజైన్ , 612 లైవ్ బుల్లెట్ , రెండు కోట్ల 16 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల బంగారం రెండున్నర కిలోల వెండి , ఇరవై ఒక్క కార్లు, 26 మోటార్స్ బైక్స్, 602 సెల్ఫోన్లు, 752 భూములు పత్రాలు.. ఒక్క బుల్లెట్ జాకెట్, 130 డైరీలను స్వాధీనం చేసుకున్నారని ఫోరం తెలిపింది. కేసులో పూర్తి వివరాలు అధికారులు వెల్లడించడం లేదంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిర్యాదు చేసింది. సమగ్ర దర్యాప్తు చేయాలంటూ గవర్నర్ కు నివేదిక ఇచ్చింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్..

Related posts