telugu navyamedia
క్రీడలు వార్తలు

భార్యకు ముద్దు పెడుతూ దొరికిన ముంబై ఆటగాడు…

వరుసగా రెండో మ్యాచుల్లో ఎదురైన ఓటమిని అధిగమించి.. రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్‌గా గెలిచింది. ఆరు మ్యాచ్‌లను ఆడిన ముంబై ఇండియన్స్.. మూడింట్లో గెలిచింది. మొత్తం ఆరు పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. ఉన్నంత సేపూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ట్రేడ్‌మార్క్ షాట్లతో చెలరేగాడు. 10 బంతుల్లో మూడుఫోర్లతో 16 పరుగులు చేశాడు. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టాండ్స్‌లో భార్య దేవిషా షెట్టితో దొరికాడు.. సూర్యకుమార్ యాదవ్. తన భార్యకు హాట్ హాట్‌గా ఓ కిస్ ఇస్తూ కెమెరా కంటికి చిక్కాడు. అద్దానికి అటు వైపున ఉన్న దేవిషా షెట్టి చిక్స్ మీద ముద్దు పెడుతూ కనిపించాడు. దేవిషా షెట్టి ఆ గ్లాస్‌కు తన చెంపను ఆనించి నిల్చోగా.. అటు వైపున్న సూర్యకుమార్ యాదవ్ కిస్ చేయడం కనిపించింది. అక్కడున్న ఫొటోగ్రాఫర్లు ఆ సీన్‌ను క్లిక్‌మనిపించారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఫొటోపై తెగ కామెంట్లు చేస్తున్నారు.

Related posts