telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ సామాజిక

జూలై 1న ఏపీ ఇంటర్ మార్కుల జాబితాల విడుదల!

ap logo

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ మార్కుల జాబితాలను వచ్చే నెల 1వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామని ఏపీ ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ మార్కుల మార్కుల జాబితాలను జ్ఞానభూమి వెబ్ సైట్ లో విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. జూలై 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలోతెలిపింది.

Related posts