బిగ్ బాస్-3 తెలుగు రియాలిటీ షో నుంచి గత వారం రోహిణి ఎలిమినేట్ కాగా… ప్రస్తుతం ఐదో వారం షో కొనసాగుతోంది. ఇప్పుడు హౌజ్ లో 12 మంది సభ్యులు ఉన్నారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈసారి ఎలిమినేషన్‌లో బాబా భాస్కర్, పునర్నవి, మహేష్, హిమజ, అషు, మహేష్, రాహుల్ ఏడుగురు సభ్యులు ఉన్నారు. హౌజ్ లో భార్యాభర్తలు వరుణ్ సందేశ్, వితికా షెరు కూడా ఉండడంతో రొమాన్స్ వర్కవుట్ అవుతుంది. దాంతో పాటు బిగ్ బాస్ బజ్ నుంచి మరింత ఎక్స్ ట్రా పర్సనల్ విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. వరుణ్ సందేశ్‌తో తన ప్రయాణం గురించి మరోసారి చెప్పింది వితికా షెరూ. అయితే ఈ సారి మాత్రం ఇంకాస్త కొత్త విషయాలు చెప్పింది వితికా. అసలు వరుణ్ సందేశ్‌తో తన ప్రయాణం ఎలా మొదలైందనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తనకు మొదట్లో వరుణ్‌ను చూస్తుంటే జాలేసిందని చెప్పింది ఈమె. అయితే ముందు తనతో సినిమా చేయకూడదని తన నోట్స్‌లో కూడా రాసి పెట్టుకున్నానని.. అతడు అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడతాడని ఫ్రెండ్స్ చెప్పడంతో దూరం పెట్టానని చెప్పింది ఈమె. ఆ తర్వాత తమ షూటింగ్ మొదలైన రెండు నెలలకు కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదని.. చివరికి ఓ రోజు సినిమా క్లైమాక్స్ సీన్ కోసం ఇద్దరమే కార్లో ఉన్నపుడు మాట్లాడాడని చెప్పింది వితికా. అప్పటికే ఓ సారి తాను అమెరికా వెళ్లి రావడంతో అక్కడ ఏమేం చూసావంటూ వరుణ్ మాట్లాడినట్లు చెప్పింది వితికా. అక్కడ్నుంచి తనతో స్నేహం పెరిగిందని.. షూటింగ్ తర్వాత ఒక్కడే ఇంట్లో ఉండేవాడని.. ఎలా తింటాడో ఉంటాడో అనే జాలి తనపై ఉండేదని చెప్పింది వితికా. అక్కడ్నుంచే తమ జర్నీ మొదలైనట్లు చెప్పుకొచ్చింది ఈమె. ఇదంతా కూడా బిగ్ బాస్ ఎక్స్ ట్రా బజ్‌లో చూపించడంతో అసలు కహానీ బయటికి వచ్చింది.
previous post
భయపడి బయటకు రాలేదు… ఇప్పుడా బాధ లేదు : సమీరా రెడ్డి