telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

40వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగింపు.. రోజువారీ మైంటెనెన్సు లేక మొరాయిస్తున్న బస్సులు ..

rtc protest started with arrest

నేటితో ఆర్టీసీ సమ్మె కు 40 రోజులు. డిపోలు, బస్సు స్టేషన్లలో నిరాహార దీక్షలకు జరుగుతూనే ఉన్నాయి. కూకట్‌పల్లి డిపోలో నిర్వహిస్తున్న దీక్షలో ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ పాల్గొని సంఘీభావం తెలిపారు. డిపోల్లో కార్మికులు శిబిరాలు ఏర్పా చేసి దీక్ష కొనసాగిస్తున్నారు. బస్సులు ఏ మాత్రం మరమ్మతులకొచ్చినా బాగు చేసేవారు లేక అవి మూలకే చేరుతున్నాయి.

నిన్నటికి గ్రేటర్‌ జోన్‌ పరిధిలో దాదాపు 920 బస్సులు నడిచాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సోమవారం రైలు ప్రమాదం వల్ల సికింద్రాబాద్‌ నుంచి ఫలక్‌నుమా మార్గంలో ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దయ్యాయి. సికింద్రాబాద్‌ – లింగంపల్లి మధ్యే రైళ్లు నడిచాయి. పాతబస్తీ, కాచిగూడ, మలక్‌పేట, విద్యానగర్‌, జామై ఉస్మానియా, ఆర్ట్స్‌ కళాశాల, సీతాఫల్‌మండి స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లు నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Related posts