విజయవాడ ఎన్.ఆర్.ఐ ఆసుపత్రి లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే బయటపడ్డ రికార్డులను ప్రస్తుత యాజమాన్యం కాల్చివేసింది. ఎన్.ఆర్.ఐ ఆసుపత్రి ప్రస్తుత యాజమాన్యం పై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో FIR నమోదు అయ్యింది. 420/406,120b/r 34 IPC సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారు. అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీ లే విభేదాలే దీనికి ప్రధాన కారణం. కోవిడ్ సమయంలో మరియు అంతకు ముందు ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ కు వచ్చిన ఆదాయ విషయంలో మరియు హాస్పటల్లో నిత్య రాబడి, ఖర్చుల అకౌంట్స్ సంబంధించిన అంశమే వివాదానికి కారణంగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అకౌంట్ విభాగాన్ని పర్యవేక్షించే చీప్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ను అదుపులో తీసుకున్నారు మంగళగిరి రూరల్ పోలీసులు. రికార్డులో చూపని లావాదేవీల విలువ సుమారు కోట్లాది రూపాయలలో ఉన్నట్టు సమాచారం. చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ శ్రీనివాస్ తో పాటు అదే విభాగంలో పనిచేస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేసారు.
previous post
next post